31, ఆగస్టు 2010, మంగళవారం

10, జూన్ 2010, గురువారం

గుజరాత్ గాయం

ఎప్పుడో చిన్నప్పుడు
రెండిళ్ళ అవతల
ఓ గుడిసె తగలబడినప్పుడు
గంటల కారు (ఫైరింజను) మోతకు
కేకలు,బొబ్బలతో వీధంతా మార్మోగింది.
తొంగి చూస్తూ తమ్ముడంటాడు-
" అమ్మా, మనింటికి కూడా వస్తే బాగుండు గంటల కారు"
"నోర్ముయ్,వెధవా" అంటుంది అమ్మ,
బిందెలతో నీళ్ళందిస్తూ.
ఇప్పుడు
మనిల్లు మండే గుజరాత్!
సహాయం కోసం ఆర్తనాదాలు, హాహాకారాలూ!
గుండె పగిలిన భూదేవి అమ్మ
అయినా తొంగి చూడడు
తమ్ముడు పారిస్ లో
నాకింకా
వూపిరి ఆడని పొగ
చుట్టు ముట్టిన దృశ్యం
అప్పుడెప్పుడో
ఫైవ్ స్టార్ హాస్పెటల్లొ
డాక్టరు చెల్లెలు చప్పిన గారడీ లో
ప్రాణం పోతున్నా
పోస్తున్నట్లుగా
సహాయం అందని
భాధా తప్త శవాలకు
ప్రకటనలు, వాగ్దానాలూ వర్షంలా
హింస ఒక వ్యసనమైతే
బోధి వృక్స్లల వేళ్ళు తెగుతాయి
చంపడమొక నాగరికత అయితే
ఏ సబర్మతీ తీరాన స్వాతంత్రాలూ
అనర్హ మవుతాయి
శతాబ్దాల యుద్ధాలు,భూ కంపాలూ
ఇంతకన్నా భయంకరం కావు
నిన్నటి దంతా ఒక పీడకలే అయితే
రెపటికుంటుందా పీడనలేని కధ?
ఇది చరిత్ర కివ్వాల్సిన సమాధానం
అది గుజరాత్ గుండెలో గాయం